Team India: టీమిండియా అద్భుత విజయంపై గంగూలీ, సచిన్ స్పందన

Ganguly and Sachin response on Team India victory
  • నాలుగో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా
  • ఒత్తిడిని జయించడంలోనే తేడా ఉందన్న గంగూలీ
  • 3-1 తేడాతో సిరీస్ ను సాధించాలన్న సచిన్
ఇంగ్లండ్ తో ఓవల్ లో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంత చేసుకుంది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్ ను భారత్ ఏకంగా 157 పరుగుల భారీ తేడాతో గెలుచుకుంది. తద్వారా ఈ సిరీస్ లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది.

ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రసంశల జల్లు కురుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ... ఇరు జట్ల నైపుణ్యంలో తేడా ఉందని... అయితే అతిపెద్ద తేడా ఒత్తిడిని జయించడంలోనే ఉందని చెప్పాడు. ఈ విషయంలో టీమిండియా ఎన్నో రెట్లు మెరుగైన స్థానంలో ఉందని అన్నాడు.

భారత విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ... ఓటమి నుంచి తేరుకుని మన కుర్రాళ్లు మళ్లీ విజయాలను సాధిస్తున్నారని కితాబునిచ్చాడు. మ్యాచ్ చివరి రోజున వికెట్ నష్టపోకుండా 77 పరుగులతో ఆడుతున్న ఇంగ్లండ్ పై భారత్ సాధించిన ఆధిపత్యం అమోఘమని కొనియాడాడు. ఈ సిరీస్ ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని ఆకాంక్షించాడు.
Team India
Sachin Tendulkar
Sourav Ganguly

More Telugu News