Sharmila: ష‌ర్మిల నిరుద్యోగ దీక్ష ప్రారంభం

sharmila stages hunger strike
  • నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
  • మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద దీక్ష‌
  • పాల్గొన్న ప‌లువురు నిరుద్యోగులు
నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఆమె మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు.

ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అనంతరం ఆమె ప్ర‌సంగిస్తారు. ఈ సందర్భంగా ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలిపారు. ‘నిరుద్యోగ నిరాహారదీక్ష’లో ప‌లువురు విద్యార్థులు, స్థానిక నేత‌లు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో ల‌క్షా 90 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే వర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని ఆమె చెప్పారు.
Sharmila
YSRTP
Telangana

More Telugu News