Somireddy Chandra Mohan Reddy: వైసీపీ నేతల ధనదాహానికి వ్యవస్థలు కూలుతున్నాయి: సోమిరెడ్డి

Somireddy fires on YCP leaders
  • నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై ధ్వజమెత్తిన సోమిరెడ్డి
  • ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయని ఆరోపణ
  • ఫిర్యాదు చేసినా స్పందనలేదని వెల్లడి
  • భూములు, ఆస్తులు కాజేస్తున్నారని ఆగ్రహం
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతల ధనదాహానికి వ్యవస్థలు కూలుతున్నాయని వ్యాఖ్యానించారు. సర్వేపల్లిలో ప్రభుత్వ భూమి మాయం అవుతోందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు తెలియకుండానే ఈ తతంగం జరుగుతోందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తులను కాజేసే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు.

చిల్లకూరులో ఇప్పటికే 250 ఎకరాల ప్రభుత్వ భూమి ధారాదత్తం చేశారని, కాకుటూరులో రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం అయిందని సోమిరెడ్డి వివరించారు. ఈ వ్యవహారాలపై ఆగస్టు 4న ఫిర్యాదు చేసినా ఇప్పటికీ కేసు నమోదు కాలేదని ఆరోపించారు. తహసీల్దార్ ఫిర్యాదు చేసినా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
Somireddy Chandra Mohan Reddy
YCP Leaders
Nellore District
TDP
Andhra Pradesh

More Telugu News