Telangana: తెలంగాణలో మరో 301 మందికి కరోనా పాజిటివ్

Telangana covid details media report
  • గత 24 గంటల్లో 67,720 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 70 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 5,505 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 67,720 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 31, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. వనపర్తి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 339 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,50,453 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,505 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,886కి పెరిగింది.
Telangana
Corona Virus
Positive Cases
Deaths

More Telugu News