అనూహ్యరీతిలో కుప్పకూలిన ఇంగ్లండ్ టాపార్డర్... గెలుపు బాటలో టీమిండియా
- 100 పరుగుల వరకు సజావుగా ఆడిన ఇంగ్లండ్
- 47 పరుగుల తేడాతో 6 వికెట్లు డౌన్
- ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్లకు 149 రన్స్
- రాణించిన టీమిండియా బౌలర్లు
ఓపెనర్లు రోరీ బర్న్స్ 50, హసీబ్ హమీద్ 63 పరుగులు చేశారు. డేవిడ్ మలాన్ 5, ఓల్లీ పోప్ 2, బెయిర్ స్టో 0, మొయిన్ అలీ 0 పరుగులు మాత్రమే చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 68 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు కాగా, ఆ జట్టు గెలవాలంటే ఇంకా 219 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం కెప్టెన్ జో రూట్ 18 పరుగులతోనూ, క్రిస్ వోక్స్ 2 పరుగులతోనూ ఆడుతున్నారు.