Raja Singh: 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన బండి సంజయ్.. కీలక వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్

Bandi Sanjays padayatra going successful says Raja Singh
  • బండి సంజయ్ కు అడ్డొస్తే పగిలిపోతుంది
  • తప్పుడు నివేదికలు ఇచ్చి హుజూరాబాద్ ఉపఎన్నికలు ఆపేశారు
  • డ్రగ్స్ కేసులో రాజకీయ నాయకుల పేర్లు కూడా వస్తాయి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, బండి సంజయ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. సంజయ్ కు ప్రజలంతా సాదరంగా స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. బండి సంజయ్ కు అడ్డు వస్తే పగిలిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తప్పుడు నివేదికలను ఇచ్చి హుజూరాబాద్ ఉపఎన్నికను ఆపేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజాసింగ్ మండిపడ్డారు. ఎన్నిక ఎప్పుడు జరిగినా గెలిచేది బీజేపీనే అని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని అన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెల 2వ తేదీన బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Raja Singh
BJP
Bandi Sanjay
TRS
Huzurabad

More Telugu News