Huzurabad: ‘దళితబంధు’లో భాగంగా 8 వేల దళిత కుటుంబాలకు రూ. 800 కోట్ల నగదు బదిలీ

  • హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 వేల కుటుంబాల గుర్తింపు
  • గత మూడు రోజులుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ
  • గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు
telangana govt transfers Rs 800 crore to dalitha bandhu Beneficiaries

దళితబంధు పథకంలో భాగంగా నిన్నటి వరకు 8 వేల దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ. 800 కోట్ల నగదు బదిలీ జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 20 వేల దళిత కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం 8 వేల కుటుంబాలకు నగదు బదిలీ చేసింది.

 నియోజకవర్గంలో గత రెండు వారాలుగా  గ్రామాల వారీగా లబ్ధిదారుల నుంచి  పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటిని పరిశీలించిన ఎంపీడీవోలు లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. దీని ఆధారంగా గత మూడు రోజులుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ చేస్తున్నారు. శుక్రవారం రూ. 100 కోట్లు, శనివారం రూ. 200 కోట్లు, నిన్న రూ.500 కోట్లు చొప్పున జమచేసినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News