YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్యకేసు.. మరో నలుగురి విచారణ

ys viveka murder case cbi questioned another four persons
  • పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుల విచారణ
  • పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని, అతడి తల్లిని విచారించిన పోలీసులు
  • కీలక సమాచారం రాబట్టిన అధికారులు!
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు నిన్న మరో నలుగురు అనుమానితులను విచారించారు. వీరిలో పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, తొండూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివమోహన్‌రెడ్డి ఉన్నారు. కడపలో వీరిని విచారించిన అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది.

అలాగే, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి తల్లి బీబీని పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విచారించారు. హత్య జరగడానికి రెండు నెలల ముందునుంచీ వివేకానందరెడ్డి ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారో కాల్‌డేటా ద్వారా వివరాలు సేకరించిన అధికారులు దాని ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు.
YS Vivekananda Reddy
Murder Case
CBI

More Telugu News