తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్వ్యూకు వెళుతున్న ఐదుగురు స్నేహితుల దుర్మరణం
- బాధితులందరూ 25-30 ఏళ్లలోపు వారే
- అందరూ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే
- ప్రమాదం ధాటికి నుజ్జునుజ్జయిన కారు
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారి మృతదేహాలను అతి కష్టంపై బయటకు తీశారు. వీరంతా 25-30 ఏళ్ల లోపు వారేనని పేర్కొన్న పోలీసులు వారిని.. రాహుల్ కార్తికేయన్ (పుదుక్కోట), రాజాహరీష్ (మేట్టూరు), అరవింద్ శంకర్ (చెన్నై కేకే నగర్), అజయ్ (తిరుచ్చి), నవీన్ (మేట్టూర్)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.