Telangana: టీఆర్​ఎస్​ ను వీడుతున్నారన్న వార్తలపై స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు

Thummala Nageshwar Rao Clarification On Party Changing
  • పార్టీ మారడం లేదని స్పష్టీకరణ
  • సీఎం కేసీఆర్ తోనే ప్రయాణమని వెల్లడి
  • నీతికి కట్టుబడి ఉన్నానని కామెంట్
చాలా రోజులుగా టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు బయటకు రావడం లేదు. ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయిందని, పార్టీని వీడుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, వాటిపై ఆయన తాజాగా స్పందించారు.

తాను పార్టీ మారడం లేదని, ఆ ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ తోనే తన రాజకీయ ప్రయాణమని తెలిపారు. రాజకీయాల్లో తాను నీతి, నిజాయతీకి కట్టుబడి ఉన్నానన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని, సీఎం కేసీఆర్ భారీగా నిధులను ఖర్చు చేశారని ఆయన చెప్పారు.
Telangana
TRS
Thummala
Thummala Nageshwar Rao
KCR

More Telugu News