హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
- నిన్న రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షాలు
- జలమయమైన రోడ్లు
- నిండిన చింతలచెరువు
వాహనదారులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఈ రోజు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి. అలాగే, బాటసింగారం నుంచి మజీద్‌పూర్ వెళ్లే దారిలోనూ వరద ప్రభావం అధికంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.