ఏపీలో మరో 1,502 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 63,717 కరోనా టెస్టులు
- నెల్లూరు జిల్లాలో 260 మందికి పాజిటివ్
- విజయనగరం జిల్లాలో 17 కేసులు
- రాష్ట్రంలో 16 మంది మృతి
- 14,883 మందికి కొనసాగుతున్న చికిత్స
అదే సమయంలో 1,525 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 13,903 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో నేటి వరకు 20,19,702 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,90,916 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,883 మంది చికిత్స పొందుతున్నారు.