Ravishyam: 'నేను అంబానీ అల్లుడ్ని... జడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలి' అంటూ పోలీసులను హడలగొట్టిన యువకుడు

Mirzapur man says he is son in law of Mukesh Ambani
  • డీఐజీ కార్యాలయానికి వెళ్లిన రవిశ్యామ్ ద్వివేది
  • అంబానీ పేరు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురైన పోలీసులు
  • తనకు ఇద్దరు భార్యలని వెల్లడి
  • పెద్ద భార్య తమన్నా, రెండో భార్య ఈషా అని వివరణ
ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. డాక్టర్ రవిశ్యామ్ ద్వివేది అనే వ్యక్తి తాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అల్లుడ్ని అంటూ పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేశాడు. తనకు ఇద్దరు భార్యలని, పెద్ద భార్య పేరు తమన్నా భాటియా అని, రెండో భార్య పేరు ఈషా అంబానీ (ముఖేశ్ తనయ) అని వెల్లడించారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పోలీసులను కోరాడు.

డాక్టర్ రవిప్రకాశ్ ద్వివేది వింధ్యాచల్ జోన్ డీఐజీ కార్యాలయానికి వెళ్లి అంబానీ కుటుంబ సభ్యులతో బంధుత్వం వరుసలు కలిపి చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. 2017లో సోదరులు తనపై దాడి చేశారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.

దాంతో పోలీసులు స్పందిస్తూ, ముఖేశ్ అంబానీతో ఫోన్ లో మాట్లాడతావా? అని ప్రశ్నించగా, అలా మాట్లాడితే ఆయన జీవితం ప్రమాదంలో పడుతుందని అంటూ పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Ravishyam
Mukesh Ambani
Son-In-Law
Mirzapur
Uttar Pradesh

More Telugu News