Kangana Ranaut: 'తలైవి' సినిమా విడుదల నేపథ్యంలో... జయలలిత సమాధి వద్దకు కంగన

Kangana Pays Homage To Talaivi Puratchi Jaya Lalitha
  • తలైవి సినిమా విజయం సాధించాలని ఆకాంక్ష
  • ఎంజీఆర్ సమాధి వద్దకూ వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్
  • ఈ నెల 10న విడుదల కానున్న ‘తలైవి’
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్దకు వెళ్లారు. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘తలైవి’ సినిమాలో టైటిల్ పాత్రను కంగన పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత స్మారకం వద్దకు కంగన వెళ్లి, నివాళుర్పించి కాసేపు అక్కడే ఉన్నారు. తలైవి సినిమా అందరికీ చేరువయ్యేలా చూడాలని ఆమె కోరుకున్నారు.


  అనంతరం ఎంజీఆర్ సమాధి వద్దకూ వెళ్లి నివాళులర్పించారు. ఇకనుంచి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండనున్నట్టు చెప్పారు. విద్యార్థి దశ నుంచి సినిమాల్లో హీరోయిన్ గా, రాజకీయ నేతగా ఎదిగిన జయలలిత జీవిత చరిత్ర మొత్తాన్ని సినిమాలో చూపించనున్నారు.

ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ఎంజీఆర్ తో పరిచయం వంటి వాటినీ సినిమాలో ఆవిష్కరించనున్నారు. ఎ.ఎల్. విజయ్ డైరెక్టర్ కాగా.. ఎంజీఆర్ గా అరవిందస్వామి నటించారు. భాగ్యశ్రీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Kangana Ranaut
Bollywood
Jayalalitha
Chennai
Tamilnadu

More Telugu News