అక్కడ మద్యం కొనాలంటే ఆధార్ కార్డు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి!
- తమిళనాడులోని నీలగిరి జిల్లా అధికారుల వినూత్న ప్రయోగం
- కరోనాను కట్టడి చేసేందుకు నిబంధనలు
- 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఆంక్షలు
దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుతో పాటు రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని నిబంధనలు విధించారు. వాటిని తీసుకొస్తేనే మద్యం విక్రయించాలని దుకాణాల సిబ్బందికి చెప్పారు. ఆ జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ నిబంధనలకు సంబంధించిన ఫ్లెక్సీలను మద్యం దుకాణాల ముందు ఏర్పాటు చేశారు.