ఏపీలో మరో 1,378 మందికి కరోనా పాజిటివ్

02-09-2021 Thu 19:22
  • గత 24 గంటల్లో 59,566 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 242 కేసులు
  • విజయనగరం జిల్లాలో 13 కేసులు
  • రాష్ట్రంలో 10 మంది మృతి 
AP Corona Update

ఏపీలో గడచిన 24 గంటల్లో 59,566 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,378 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 242 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 219, కృష్ణా జిల్లాలో 178, నెల్లూరు జిల్లాలో 166, పశ్చిమ గోదావరి జిల్లాలో 145 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 13 కేసులను గుర్తించారు.

అదే సమయంలో 1,139 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,16,680 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19,88,101 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,702 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,877కి పెరిగింది.