'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ప్రకటన!

02-09-2021 Thu 10:56
  • విజయ్ ఆంటోని నుంచి 'విజయ రాఘవన్'
  • కథానాయికగా 'ఆత్మిక'
  • ఈ రోజు సాయంత్రం ట్రైలర్ రిలీజ్
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల
Vijay Raghavan movie release date confirmed
తమిళనాట విలక్షణ నటుడిగా విజయ్ ఆంటోనికి పేరు ఉంది. సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన, ఆ తరువాత నటనవైపుకు వచ్చాడు. నటుడిగా 'బిచ్చగాడు' సినిమా ఆయనను నిలబెట్టేసింది. అప్పటి నుంచి హీరోగా ఆయన వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విజయ రాఘవన్' సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

రాజా - సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ద్వారా కథానాయికగా 'ఆత్మిక' పరిచయమవుతోంది. నివాస్ కె ప్రసన్న సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, ఈ రోజున సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఇక విజయ్ ఆంటోని 'బిచ్చగాడు'కి సీక్వెల్ గా 'బిచ్చగాడు 2' చేస్తున్న సంగతి తెలిసిందే.