Sharmila: నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటోంది: తండ్రిని గుర్తు చేసుకున్న ష‌ర్మిల‌

miss you dad tweets sharmila
  • ఒంటరి దానినైనా విజయం సాధించాలని నేర్పారు
  • అవమానాలెదురైనా ఎదురీదాలని చెప్పారు
  • నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించారు
  • నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయ‌న కుమార్తె వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్‌లో భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేశారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద‌ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేసిన‌ విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు.

'ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలు ఎదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటోంది. ఐ లవ్, అండ్ మిస్ యూ డ్యాడ్' అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.
Sharmila
YSRTP
Telangana
Andhra Pradesh

More Telugu News