ఏపీలో మరో 1,186 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 56,155 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 175 కేసులు
- రాష్ట్రంలో 10 కరోనా మరణాలు
- ఇంకా 14,473 మందికి చికిత్స
అదే సమయంలో 1,396 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,867కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,15,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,86,962 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,473 మంది చికిత్స పొందుతున్నారు.