Venkaiah Naidu: మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును పరామర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Vice President Venkaiah Naidu visits Kambhampati Haribabu
  • సతీసమేతంగా హైదరాబాద్ వచ్చిన వెంకయ్య
  • ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కంభంపాటి
  • తెలంగాణ రాజ్ భవన్ లో విశ్రాంతి
  • కంభంపాటి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్న వెంకయ్య
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీసమేతంగా హైదరాబాదుకు విచ్చేశారు. వెంకయ్య, ఆయన అర్ధాంగి ఉష నేడు తెలంగాణ రాజ్ భవన్ లో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును పరామర్శించారు. కంభంపాటి హరిబాబు ఇటీవల హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటినుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాజ్ భవన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో, కంభంపాటి హరిబాబును కలిసిన వెంకయ్యనాయుడు ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, హైదరాబాదు వచ్చిన ఉపరాష్ట్రపతికి విమానాశ్రయంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలికారు.
Venkaiah Naidu
Kambhampati Haribabu
Rajbhavan
Telangana

More Telugu News