Nara Lokesh: మంత్రి కన్నబాబుకు నారా లోకేశ్ సవాల్

Nara Lokesh challenges Kannababu
  • నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నానని కన్నబాబు అంటున్నారు
  • జగన్ హామీలపై కన్నబాబు చర్చకు రావాలి
  • పోలవరం ముంపు గ్రామాల్లో ఇళ్లను బలవంతంగా కూల్చి వేస్తున్నారు
ఏపీ మంత్రి కన్నబాబుపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నానని మంత్రి కన్నబాబు అంటున్నారని... కన్నబాబుకు దమ్ముంటే జగన్ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయడం లేదని లోకేశ్ మండిపడ్డారు. పోలవరం ముంపు గ్రామాల్లోని ఇళ్లను బలవంతంగా కూల్చి వేస్తున్నారని అన్నారు. ఢిల్లీలో అఖిలపక్షం ఉద్యమాలు చేస్తే... రూ. 10 లక్షల వంతున ఇస్తామని హడావుడిగా ప్రకటించారని... కానీ, ఆ డబ్బును ఇంత వరకు ఇవ్వలేదని విమర్శించారు. జగన్ ఇచ్చిన హామీలపై కన్నబాబు మాట్లాడాలని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Kannababu
Jagan

More Telugu News