KTR: కేటీఆర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లిన మంత్రులు!

KTR Reaches Delhi Over Looks The arrangements For TRS Party Office
  • ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన
  • పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలో ఆఫీస్
  • కేటీఆర్ తో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు
తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 27న పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.


టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమానికి కేటీఆర్ తో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. పార్టీ ఆఫీసును నిర్మించే ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమాలను మంత్రులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ వేడుకలపై వివిధ జిల్లాల నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని చోట్లా పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని వారికి సూచించారు.

KTR
TRS
TRS Formation Day
New Delhi
Party Office
V Srinivas Goud
KCR

More Telugu News