Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Keerti Suresh in consideration for Telugu remake of Mimi
  • రీమేక్ సినిమాలో కీర్తి సురేశ్ 
  • వెంకీ సినిమా థియేటర్లకేనా?
  • చైతూకి బాలీవుడ్ ఆఫర్లు  
*  కృతి సనన్ కథానాయికగా ఇటీవల హిందీలో వచ్చిన 'మిమి' చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలొచ్చాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు కీర్తి సురేశ్ ని అడిగినట్టు, చేయడానికి ఆమె సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
*  ప్రముఖ నటుడు వెంకటేశ్ నటించిన 'నారప్ప' సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే విధంగా ఆయన నటించిన 'దృశ్యం' సీక్వెల్ ను కూడా ఓటీటీ ద్వారానే రిలీజ్ చేస్తారంటూ వార్తలొచ్చాయి. అయితే, దీనిని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని తాజాగా ఆలోచిస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రావచ్చు.
*  అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓ హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో చైతు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి బాలీవుడ్ నుంచి మరికొన్ని ఆఫర్లు వస్తున్నట్టు, వీటిలో కొన్ని ఓటీటీ ప్రాజక్టులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి, చైతు తెలుగు సినిమాలను పక్కన పెట్టి, హిందీ ప్రాజక్టులకు ప్రాధాన్యతనిస్తాడా? అన్నది చూడాలి.
Keerti Suresh
Kriti Sanan
Venkatesh
Naga Chaitanya

More Telugu News