Dr PPK Ramacharyulu: రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్ గా రామాచార్యులు

Dr PPK Ramacharyulu appointed as new secretary general for Rajya Sabha
  • ప్రస్తుతం రాజ్యసభ కార్యదర్శిగా పనిచేస్తున్న రామాచార్యులు
  • 2018 నుంచి కార్యదర్శిగా కొనసాగుతున్న వైనం
  • తాజా పదోన్నతికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం
  • పార్లమెంటరీ వ్యవహారాల్లో విశేష అనుభవం
రాజ్యసభకు నూతన సెక్రటరీ జనరల్ గా డాక్టర్ పీపీకే రామాచార్యులు నియమితులయ్యారు. రామాచార్యులు నియామకాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. రామాచార్యులు ప్రస్తుతం రాజ్యసభ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2018 నుంచి ఆయన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. గత మూడు దశాబ్దాలుగా వివిధ పార్లమెంటరీ కమిటీలను పర్యవేక్షించారు. ఎంపీలాడ్స్ కమిటీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీ, హోంశాఖ కమిటీల కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు.
Dr PPK Ramacharyulu
Secretary General
Rajya Sabha
Parliament
India

More Telugu News