Shilpa Shetty: భర్త రాజ్ కుంద్రాకు దూరం కావాలనుకుంటున్న శిల్పాశెట్టి?

Shilpa Shetty to end her relationship with husband Raj Kundra
  • పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్
  • తప్పును సరిదిద్దుకుంటానన్న శిల్పాశెట్టి
  • ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద చర్చ 
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ తో బాలీవుడ్ ఉలిక్కిపడింది. మరోవైపు రాజ్ కుంద్రాపై పలువురు బాలీవుడ్ స్టార్లు విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ షాక్ నుంచి శిల్పాశెట్టి కోలుకుంటోంది. తిరిగి డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంటోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

తప్పులు అందరూ చేస్తారని... అయితే ఆ తప్పులు భయంకరంగా ఇతరులను బాధించేలా ఉండకూడదని ఆమె తెలిపింది. వీటిని తాను సరిదిద్దుకుంటానని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. భర్తకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకోవడమే తప్పనే భావనలో శిల్ప ఉందని అంటున్నారు. రాజ్ కుంద్రా వల్ల శిల్పాశెట్టి పరువు, ఆమె కుటుంబ పరువు పూర్తిగా పోయిందని... ఈ నేపథ్యంలో ఆయనతో కొనసాగే ఆలోచన శిల్పకు లేదని బాలీవుడ్ టాక్. మరి ఏం జరగనుందో వేచి చూడాలి.
Shilpa Shetty
Raju Kundra
Bollywood

More Telugu News