కామారెడ్డిలో దారుణం.. ఇంట్లోకి చొరబడి యువతి గొంతు కోసిన ఉన్మాది

31-08-2021 Tue 12:42
  • పనిచేసుకుంటుండగా ఘటన
  • ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Unidentified Person Entered Home Slit 21 Year Old Girl Throat
తెలంగాణలోని కామారెడ్డిలో ఓ యువతి గొంతు కోశాడో ఉన్మాది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి.. పనిచేసుకుంటున్న యువతి గొంతు కోసేసి పరారయ్యాడు. ఈ ఘటన కామారెడ్డిలోని బర్కత్ పుర కాలనీలో జరిగింది. బాధితురాలి అరుపులు విని అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని నిషత్ ఫిర్దోస్ (21)గా గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి ఎవరు? దాడి ఎందుకు చేశాడు? అన్న వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.