Gudivada Amarnath: చర్చా వేదికలో టీడీపీ నేతలు దద్దమ్మల్లా మాట్లాడారు: ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్

Gudivada Amarnath fires on TDP leaders
  • ఉత్తరాంధ్ర చర్చా వేదిక టీడీపీ భజనమండలి సమావేశంలా ఉంది
  • ఉత్తరాంధ్రను టీడీపీ నాశనం చేసింది
  • విశాఖను పాలనా రాజధానిగా ఒప్పుకుంటున్నారా? లేదా? చెప్పండి

ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికలో దద్దమ్మల్లా మాట్లాడారని విమర్శించారు. ఈ సమావేశం టీడీపీ భజనమండలి సమావేశంలా ఉందని అన్నారు. ఉత్తరాంధ్రను నాశనం చేసిన టీడీపీ నేతలు, రక్షిస్తున్నట్టు మాట్లాడారని దుయ్యబట్టారు.

విశాఖను పాలనా రాజధానిగా ఒప్పుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని టీడీపీ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖను కాకుండా అమరావతిని రాజధానిగా ఎందుకు చేశారో చెప్పాలని అన్నారు. త్వరలోనే విశాఖ పాలనా రాజధాని అవుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని... టీడీపీ నేతలు సిద్ధమా? అని అమర్ నాథ్ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News