DMK: బెంగళూరు రోడ్డు ప్రమాద మృతుల్లో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు

DMK MLA Son and Daughter in law killed in bengaluru road accident
  • ఈ తెల్లవారుజామున ప్రమాదం
  • కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి భవనంలోకి దూసుకెళ్లిన కారు
  • నుజ్జునుజ్జయిన కారు
  • డీఎంకే హోసూరు ఎమ్మెల్యే వై. ప్రకాశ్ కుమారుడు, కోడలు దుర్మరణం
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన ‘ఆడి క్యూ3’ కారు రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఓ భవనంలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే కన్నుమూయగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

కాగా, మృతి చెందిన వారిలో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై.ప్రకాశ్ కుమారుడు కరుణాసాగర్, కోడలు బిందు కూడా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం అనంతరం నుజ్జునుజ్జయిన కారు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
DMK
Road Accident
Bengaluru
Karnataka
Y.Prakash
Karuna Sagar

More Telugu News