వ్యక్తిగత కారణాలతోనే ఎస్సై భవాని ఆత్మహత్య.. ఈ రోజు చనిపోతున్నానంటూ నోట్!
- శిక్షణ కోసం విజయనగరం వచ్చిన భవాని
- పీటీసీ క్వార్టర్స్‌లో మూడు రోజుల క్రితం ఆత్మహత్య
- ‘నేను ఈ రోజు చనిపోతున్నా’నన్న నోట్ తప్ప లభించని ఆధారాలు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె మృతికి కారణాలను శోధించారు. తాజాగా, ఆమె బస చేసిన గదిలోని ఓ పుస్తకంలో భవాని రాసినట్టుగా చెబుతున్న ‘ఈ రోజు చనిపోతున్నా’ అని ఉన్న నోట్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుమించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.