ఈడీ విచారణకు హాజరైన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్
Add ap7am to your home Screen

ఈడీ విచారణకు హాజరైన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్

Bollywood beauty Jacqueline for the whole trial
  • గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
  • మనీలాండరింగ్ కేసులో సాక్షి
  • సుకేష్ చంద్రశేఖర్ అనే మోసగాడి కేసు
  • చేతినిండా సినిమాలతో బిజీగా శ్రీలంక బ్యూటీ
బాలీవుడ్ నటి, శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తాజాగా ఢిల్లీలోని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారుల ముందు విచారణకు హాజరైంది. ఆమెను కొన్ని గంటలపాటు అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒక మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను సాక్షిగా చేర్చినట్లు అధికారులు తెలిపారు. సుకేష్ చంద్రశేఖర్ అనే ఒక మోసగాడికి సంబంధించిన కేసులోనే జాక్వెలిన్‌ విచారణకు హాజరైనట్లు సమాచారం.

ఎన్నికల సంఘానికి సంబంధమున్న ఒక లంచం కేసులో కూడా  ఈ నిందితుడి హస్తం ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆగస్టు 24న చెన్నైలో సముద్ర తీరంలోని ఒక బంగ్లాను సీజ్ చేశారు. ఆ సమయంలో ఈడీ అధికారులకు రూ.82.5 లక్షల నగదు, డజనుకు పైగా లగ్జరీ కార్లు కూడా దొరికాయి. ఈ కేసులోనే జాక్వెలిన్‌ను సాక్షిగా విచారణ జరిపేందుకు ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం.

శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ పన్నెండేళ్లుగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి రామ్ సేతు, బచ్చన్ పాండే సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కిక్ 2లో కూడా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి భూత్ పోలీస్ చిత్రం, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సర్కస్ చిత్రాల్లో తెర పంచుకుంటోంది.
Jacqueline
ED
Bollywood
Money Laundering

More Telugu News