Paint: ప్యాంటుపై బంగారం పెయింట్.. ఇదో కొత్తరకం స్మగ్లింగ్!

Paint on pant total gold if cut at customs
  • రెండు పొరల ప్యాంటుతో ప్రయాణికుడు
  • ప్యాంటుపై పసుపు రంగు పెయింట్
  • కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టులో ఘటన
  • అధికారులకు చిక్కిన 302 గ్రాముల బంగారం పేస్ట్

విమానాలు ల్యాండవగానే హడావుడిగా ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ప్యాంటుపై పసుపు రంగు మరకలు ఉండటం కస్టమ్స్ అధికారుల దృష్టిని ఆకర్షించింది. సదరు ప్యాసింజర్‌ను ఆపారు. పూర్తిగా చెక్ చేస్తే.. అతని ప్యాంటుపై మరకలు పెయింట్ కాదని, అది మొత్తం బంగారమని తేలింది. అంతేకాదు సదరు ప్యాంటు రెండు పొరలతో ఉంది. బంగారాన్ని పేస్టుగా మార్చి దాని లోపల పొరలపై పైనుంచి కింది వరకూ నింపేశాడా వ్యక్తి. దానిపై రెండో పొర కప్పి, ఏమీ ఎరగనట్లు ప్యాంటు ధరించాడు.

ఈ ఘటనలో 302 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ రూ.14 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఈ ప్యాంటును కత్తిరించిన అధికారులు.. ఆ ఫొటోలను నెట్టింట్లో విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు అతడి కొత్త ఆలోచనకు షాక్ అవుతుంటే, మరికొందరేమో మెటల్ డిటెక్టర్స్ ఉండే చోట ఇలా ఎలా తీసుకెళ్లాడంటూ ఆ దొంగ తెలివితేటలు చూసి నవ్వుతున్నారు.

  • Loading...

More Telugu News