Chinthamaneni Prabhakar: నోటీసులు ఇచ్చి చింతమనేని ప్రభాకర్ ను విడుదల చేసిన పోలీసులు

Denduluru police released Chintamaneni Prabhakar
  • నిన్న విశాఖలో చింతమనేని అరెస్ట్
  • రాత్రంతా చింతపల్లిలోనే ఉంచిన పోలీసులు
  • ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాకు తరలింపు
  • విడుదల అనంతరం స్వగ్రామానికి వెళ్లిన చింతమనేని
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. దెందులూరు పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసిన అనంతరం విడిచిపెట్టారు. ఈ క్రమంలో చింతమనేని తన స్వగ్రామం పెదవేగి మండలం దుగ్గిరాల చేరుకున్నారు.

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన చింతమనేనిపై దెందులూరులో కేసు నమోదైంది. పోలీసుల విధులకు మాజీ ఎమ్మెల్యే ఆటంకం కలిగించారంటూ ఆరోపణలు వచ్చాయి. చింతమనేని నిన్న విశాఖ జిల్లాలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ సందర్భంగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, రాత్రంతా చింతపల్లిలో ఉంచారు. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించారు.
Chinthamaneni Prabhakar
Notice
Police
TDP
Denduluru
West Godavari District

More Telugu News