Krishna: కొన్ని ఫ్లాప్ సినిమాలతో రమేశ్ బాబు నటనకు దూరం అయ్యాడు: సూపర్ స్టార్ కృష్ణ

Superstar Krishna opines on his elder son Ramesh Babu acting career
  • ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చిన కృష్ణ
  • తన కుమారులపై అభిప్రాయాలు
  • రమేశ్ నటన మాని నిర్మాత అయ్యాడని వ్యాఖ్య 
  • మహేశ్ పెద్ద స్టార్ అవుతాడని ఊహించామని వివరణ
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తన పెద్ద కుమారుడు రమేశ్ బాబు గురించి చెబుతూ, కొన్ని ఫ్లాప్ చిత్రాల కారణంగానే అతడు నటనకు దూరం అయ్యాడని తెలిపారు. రమేశ్ బాబు కెరీర్ లో ఓ దశలో మంచి సబ్జెక్టులు పడలేదని, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'బ్లాక్ టైగర్' వంటి చిత్రాలు దెబ్బకొట్టాయని వివరించారు. దాంతో రమేశ్ బాబు నటనకు స్వస్తి పలికి నిర్మాతగా మారాడని కృష్ణ తెలిపారు.

ఇక తన చిన్నకుమారుడు మహేశ్ బాబు గురించి చెబుతూ, మహేశ్ పెద్ద స్టార్ అవుతాడని అతడి చిన్నప్పుడే ఊహించామని అన్నారు. 'పోరాటం' సినిమా చూసినప్పుడే డూండీ వంటి సినీ ప్రముఖుడు మహేశ్ బాబు గొప్పనటుడు అవుతాడని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

అన్న రమేశ్ బాబుకు మహేశ్ ఎంతో తోడ్పాటు అందిస్తాడని, ఏవైనా సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం ఇప్పించడం ద్వారా ఆర్థికంగా చేయూతగా నిలుస్తుంటాడని కృష్ణ వివరించారు. రమేశ్ ఎప్పుడు సినిమా నిర్మించినా నటించేందుకు తాను సిద్ధమని మహేశ్ చెబుతుంటాడని వెల్లడించారు.
Krishna
Ramesh Babu
Mahesh Babu
Tollywood

More Telugu News