Andhra Pradesh: తెలంగాణపై మరోసారి కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ఫిర్యాదు

  • శ్రీశైలం జలాశయంలో అక్రమంగా విద్యుదుత్పత్తి అంటూ లేఖ
  • వెంటనే ఆపేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
  • తెలంగాణ వాదనలు అసంబద్ధమన్న ఏపీ
AP Once Again Complains Againsts Telangana

శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరోమారు ఫిర్యాదు చేసింది. అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపిస్తూ లేఖ రాసింది. టీఎస్ జెన్ కో వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని అందులో కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని లేఖలో పేర్కొంది. శ్రీశైలం బేసిన్ లో పరిస్థితులను వివరిస్తూ ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి లేఖ రాశారు. పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేసే హక్కు తమకుందన్న తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు.

More Telugu News