Vijayakanth: విజయకాంత్ కు అనారోగ్యం.. దుబాయ్ కి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు

Vijayakanth family takes him to Dubai as his health not well
  • ఇటీవలి కాలంలో తరచుగా అనారోగ్యానికి గురవుతున్న విజయకాంత్
  • గత ఏడాది కరోనా బారిన పడిన వైనం
  • ఇప్పటికే అమెరికాలో చికిత్స పొందిన కెప్టెన్
డీఎండీకే పార్టీ అధినేత, కోలీవుడ్ సీనియర్ నటుడు కెప్టెన్ విజయకాంత్ ఇటీవలి కాలంలో తరచుగా అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన అమెరికాలో కూడా చికిత్స పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో, అత్యవసర వైద్య చికిత్స కోసం ఆయనను దుబాయ్ కి తీసుకెళ్లారు. తన కుమారుడితో కలిసి విజయకాంత్ చెన్నై ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ కు వెళ్లారు.

దుబాయ్ లో చికిత్స అనంతరం...  ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయనను అమెరికా తీసుకెళ్లే అవకాశం ఉందని చెపుతున్నారు. గత ఏడాది ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. అయితే చికిత్స తీసుకుని ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ఆయన పూర్తిగా కోలుకోవాలని అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.
Vijayakanth
Kollywood
Health
Dubai

More Telugu News