Nara Lokesh: 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గీతాన్ని విన‌డానికి కూడా వైసీపీ ఇష్ట‌ప‌డ‌ట్లేదు: లోకేశ్

  • తెలుగు భాష వ్యాప్తికి నడుం కట్టింది తెలుగుదేశమే
  • వైసీపీ పాలకుల నుంచి తెలుగు భాషను కాపాడుకుంటాం
  • తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు  
lokesh slams ycp

తెలుగు భాషా దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ మాతృభాష ప‌ట్ల‌ వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ తీరుపై ఆయ‌న మండిప‌డ్డారు. 'గిడుగు రామమూర్తి గారి కృషివల్లనే ఆ కాలంలో ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు, రచన అనేవి వాడుక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తెలుగు భాష అభివృద్ధి, వ్యాప్తి కోసం తమ జీవితాంతం కృషిచేసిన గిడుగు రామమూర్తిగారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం' అని నారా లోకేశ్ చెప్పారు.

'తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి, పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశమే. అలాగే ఈనాడు 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' అన్న పాటను వినడానికి కూడా ఇష్టపడని వైసీపీ పాలకుల నుంచి తెలుగు భాషను కాపాడుకుంటాం. ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News