అమెరికాలో తొలిసారిగా జింకకు కరోనా పాజిటివ్
- మనుషుల్లో అధికంగా కరోనా వ్యాప్తి
- ఇప్పటివరకు కుక్కలు, సింహాలు, గొరిల్లాల్లో కరోనా
- వైద్య పరీక్షల్లో వెల్లడైన విషయం
- అధ్యయనం చేపట్టిన ఓహియో వర్సిటీ
జంతువుల నుంచి మనుషులు-జంతువుల మధ్య కరోనా వ్యాప్తిపై ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వెటర్నరీ కాలేజి పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని జంతువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒక జింకకు కరోనా సోకిన విషయం వెల్లడైంది. ఇప్పటివరకు కుక్కలు, పిల్లులు, గొరిల్లాలు, చిరుతలు, సింహాలు కరోనా బారినపడగా, జింకకు కరోనా సోకడం ఇదే తొలిసారి.