Mallu Ravi: మల్లారెడ్డి మాటలను కేటీఆర్ సమర్ధించడం సిగ్గుచేటు: మల్లు రవి

Congress leader Mallu Ravi condemns minister Mallareddy abusive language towards Revanth Reddy
  • ఇటీవల రేవంత్ పై మల్లారెడ్డి ఫైర్
  • తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు
  • ఖండించిన మల్లు రవి
  • మల్లారెడ్డి ప్రవర్తన దిగ్భ్రాంతికరమని వెల్లడి
టీఆర్ఎస్ సర్కారుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ధ్వజమెత్తారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మల్లారెడ్డి ఓ బజారు రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన దూషణలను కేటీఆర్ ఖండించాల్సింది పోయి, వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. మల్లారెడ్డి అసభ్య పదజాలాన్ని కేటీఆర్ సమర్థించడం సిగ్గుచేటని మల్లు రవి పేర్కొన్నారు.

మల్లారెడ్డికి కేటీఆర్ వత్తాసు పలకడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఈ ఉదంతంలో మల్లారెడ్డి ఓ పాత్రధారి మాత్రమేనని అర్థమవుతోందని, బహిరంగ వేదికలపై మంత్రుల దుందుడుకు వైఖరులను కేటీఆర్, సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్న విషయం తేటతెల్లమైందని మల్లు రవి స్పష్టం చేశారు.
Mallu Ravi
Mallareddy
KTR
KCR
Revanth Reddy
Congress
TRS
Telangana

More Telugu News