Sharukh: 'పఠాన్' కోసం స్పెయిన్ కి పయనమవుతున్న షారుఖ్

Sharukh Khan Pathan song shoot in Spain
  • ఇటీవలి కాలంలో వెనుకబడ్డ షారుఖ్
  • మూడేళ్ల తర్వాత వస్తున్న 'పఠాన్'
  • కథానాయికగా దీపిక పదుకొణే
  • స్పెయిన్ లో హీరోహీరోయిన్లపై పాట  
బాలీవుడ్ బాద్ షాగా పేరుతెచ్చుకున్న హీరో షారుఖ్ ఖాన్ ఒకప్పుడు హిందీ చిత్రరంగంలో కింగ్. వరుస విజయాలు... చేతినిండా కొత్త సినిమాలతో బిజీబిజీగా ఉండేవాడు. అయితే, గత కొంతకాలంగా సరైన విజయాలు లేక వెనుకపడ్డాడు. గత మూడేళ్ల నుంచీ ఆయన నుంచి సినిమా అన్నదే లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం షారుఖ్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం 'పఠాన్'. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బిజీ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తోంది.

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ కాస్త నిదానంగా సాగుతోంది. ఆమధ్య దుబాయ్ లో ఓ షెడ్యూల్ కూడా చేశారు. ఇప్పుడు యూరప్ లో మరో షెడ్యూలు షూటింగుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పెయిన్ లో ఎక్కువ భాగం షూటింగ్ చేయనున్నారు. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు షారుఖ్, దీపిక జంటపై ఓ రమణీయమైన పాటను కూడా చిత్రీకరిస్తారట.
 
దీని గురించి చిత్ర వర్గాలు చెబుతూ, "ఇంతవరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా షూట్ చేయనటువంటి లొకేషన్లలో ఓ పాటను చిత్రీకరించనున్నాం. అందుకోసం మనోహరమైన లొకేషన్లను దర్శకుడు ఎంచుకున్నాడు. షూటింగుకి ఎటువంటి అంతరాయం కలుగకుండా వుండే విధంగా అన్ని అనుమతులు తీసుకుంటున్నాం" అంటూ సినిమా వర్గాలు పేర్కొన్నాయి. స్పెయిన్ లోనే కాకుండా మాడ్రిడ్ లో కూడా కొంత షూటింగ్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో మరో హీరో జాన్ అబ్రహాం విలన్ గా కీలక పాత్రను పోషిస్తున్నాడు.
Sharukh
Deepika Padukone
Siddharth Anand
Pathan

More Telugu News