టోక్యో పారాలింపిక్స్‌లో సంచలనం.. టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భవీనాబెన్ పటేల్
- ఫైనల్‌లో అడుగుపెట్టి తొలి పతకాన్ని ఖరారు చేసిన భవీనాబెన్
- వరుస విజయాలతో ఫైనల్‌లోకి
- సెమీస్‌లో చైనా క్రీడాకారిణిపై విజయం
నిన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్వితీయ విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది.
తాజాగా, చైనాకు చెందిన మియావో జాంగ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. రేపు ఉదయం 7.15 గంటలకు చైనాకు చెందిన ఝౌ యింగ్‌తో భవీనా ఫైనల్‌లో తలపడనుంది.