1 మిలియన్ కి పైగా లైక్స్ తో మహేశ్ బర్త్ డే బ్లాస్టర్!

27-08-2021 Fri 11:57
  • గోవా షెడ్యూల్ పూర్తిచేసిన మహేశ్
  • తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
  • బర్త్ డే బ్లాస్టర్ దూకుడు తగ్గలేదు
  • 35 మిలియన్స్ కి పైగా వ్యూస్
  • జనవరి 13వ తేదీన సినిమా విడుదల
Sarkaru Vaari Paata movie update
మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. ఇటీవల గోవాలో జరిగిన షెడ్యూల్ తో కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా, ఈ సినిమా నుంచి బర్త్ డే బ్లాస్టర్ పేరుతో ఒక టీజర్ ను వదిలారు.

ఈ టీజర్ ను యూ ట్యూబ్ లో వదిలిన దగ్గర నుంచి ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. పాత రికార్డులను చెరిపేస్తూ, కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా 35 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను .. 1 మిలియన్ కి పైగా లైక్స్ ను రాబట్టింది. ఈ టీజర్ జోరు ఈ సినిమా యూనిట్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.

మహేశ్ బాబు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. యాక్షన్ తో పాటు కామెడీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. వెన్నెల కిషోర్ - సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. 'సంక్రాంతి' కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.