Bollywood: బిగ్​ బీ అమితాబ్​ పోలీస్ బాడీగార్డ్​ వార్షికాదాయం రూ.కోటిన్నర.. బదిలీ చేసిన పోలీస్​ డిపార్ట్​ మెంట్​!

Big B Amitab Bodyguard Annual Income Is Much Higher Department Transfers Him
  • అతడిపై విచారణ జరుపుతున్న అధికారులు
  • సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నట్టు వెల్లడి
  • అది తన భార్య పేరు మీద ఉందన్న గార్డ్
మామూలుగానే సెలబ్రిటీలు తమ తమ బాడీగార్డ్ లకు భారీ మొత్తాన్ని ముట్టజెబుతుంటారు. కానీ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బాడీగార్డ్ జితేంద్ర షిండే సంపాదన మాత్రం చాలా చాలా ఎక్కువ సుమా. ఓ సాధారణ కానిస్టేబుల్ అయిన అతడి వార్షికాదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అతడి ఏడాది సంపాదన రూ.కోటిన్నర అంటే నమ్మగలరా? అయితే, ఆ డబ్బు వస్తున్నది మాత్రం బిగ్ బీ నుంచి కాదట. దీనిపై పోలీస్ డిపార్ట్ మెంట్ విచారణ జరుపుతోంది. ఈలోగా అతడిని దక్షిణ ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

షిండే సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నట్టు, పలువురు ప్రముఖులకు భద్రత కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ సంస్థను తన భార్య నడుపుతోందని, దాంతో తనకు సంబంధం లేదని షిండే చెబుతున్నాడు. అమితాబ్ తనకు అదనంగా ఏమీ ఇవ్వట్లేదని తెలిపాడు.

మరోపక్క, ఇటు ఐదేళ్లకు మించి ఓ ప్రముఖుడి దగ్గర ఒకే బాడీగార్డ్ పనిచేయకూడదన్న నిబంధన ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, షిండే 2015 నుంచి అమితాబ్ కు బాడీగార్డ్ గా పనిచేస్తున్నారు. అమితాబ్ కు ఎక్స్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. అందులో భాగంగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయనకు బాడీగార్డులుగా ఉంటున్నారు. అందులో షిండే అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమంటూ బిగ్ బీ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.
Bollywood
Amitabh Bachchan
Big B
Body Guard
Mumbai
Police

More Telugu News