Samantha: ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేరు మార్చుకోవడంపై సమంత క్లారిటీ

Samantha responds on changing her Instagram profile name
  • పెళ్లైన తర్వాత ప్రొఫైల్ పేరును అక్కినేని సమంతగా మార్చుకున్న సామ్
  • ఇప్పుడు ఆ పేరును 'ఎస్'గా మార్చుకున్న సమంత
  • కాంట్రవర్సీలపై ఎప్పుడు పడితే అప్పుడు స్పందించలేనంటూ వ్యాఖ్య 
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యాపార రంగంలోకి కూడా ప్రవేశించారు. కెరీర్ ప్రారంభం నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూనే వచ్చానని... ఇప్పుడు కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. మరోవైపు నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇన్స్టా ప్రొఫైల్ పేరును సమంత అక్కినేనిగా మార్చుకున్న ఆమె... ఇటీవల మొత్తం పేరును తీసేసి కేవలం 'ఎస్' అనే లక్షరాన్ని మాత్రమే ఉంచింది. ఇది అభిమానుల్లో పెద్ద చర్చకు తెరతీసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రొఫైల్ నేమ్ ను 'ఎస్'గా మార్చుకోవడంపై సమంత స్పందించారు. తన చుట్టూ ఉన్న కాంట్రవర్సీలపై ఎప్పుడుపడితే అప్పుడు స్పందించలేనని... తనకు ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడతానని చెప్పారు. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని అన్నారు.
Samantha
Instagram
Profile Name
Change

More Telugu News