MAA: 'మా' ఎన్నికల తేదీ ఖరారు.. హోరెత్తనున్న ప్రచారం

MAA elections date released
  • అక్టోబర్ 10న 'మా' ఎన్నికలు
  • అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు
  • అసోసియేషన్ శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా జరగనున్న ఎన్నికలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఖరారయింది. ఎన్నికలను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. నామినేషన్ల ఆఖరు తేదీ నాటికి ఇంకా ఎవరైనా బరిలోకి దిగుతారా? అనే ఉత్కంఠ ఉంది.

'మా' శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు ఇంతకు ముందు మంచు విష్ణు మాట్లాడుతూ, ఏకగ్రీవ ఎన్నికలకు అందరూ అంగీకరిస్తే... తాను కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఎన్నికల తేదీ వెలువడిన నేపథ్యంలో ప్రచారపర్వం ప్రారంభం కానుంది. అభ్యర్థులు, వారి ప్యానల్స్ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.  
MAA
Elections
Date
Tollywood

More Telugu News