Samantha: కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుంటా: సమంత

Samantha wants to question Nag Ashwin
  • 'శాకుంతలం' పూర్తి చేసిన సమంత
  • కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు  
  • కొంత విరామం తరువాతనే కథలు వింటాను
  • ఇప్పుడొస్తున్నవన్నీ పుకార్లేనన్న సమంత  
తెలుగులో సీనియర్ స్టార్ హీరోయిన్ గా సమంతకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె తాజా చిత్రంగా 'శాకుంతలం' సినిమా రూపొందింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సమంత తదుపరి సినిమాలను గురించిన ఊహాగానాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ కొత్త ప్రాజెక్టు కోసం సమంతను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే నాగ్ అశ్విన్ తన తాజా చిత్రంలో ప్రభాస్ జోడీగా సమంతను ఎంపిక చేసి, ఆ తరువాత ఆమెను పక్కన పెట్టేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై తాజాగా సమంత తనదైన స్టైల్లో స్పందించింది.

పవన్ కల్యాణ్ సినిమాలో తాను చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. అలాగే ప్రభాస్ సినిమాలో నుంచి నాగ్ అశ్విన్ తనని తీసేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోందని అంది. ఆయన అలా ఎందుకు చేశాడనేది తాను కనుక్కుంటానంటూ, అదంతా పుకారేననే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను ఏ సినిమాను అంగీకరించలేదనీ, కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న తరువాతనే కొత్త కథలు వినడం మొదలు పెడతానని చెప్పుకొచ్చింది.
Samantha
Pavan Kalyan
Prabhas

More Telugu News