YS Sharmila: మీడియా మిత్రులారా, దయచేసి కేసీఆర్ ట్రాప్ లో పడకండి: షర్మిల

YS Sharmila requests media not to fall in KCR trap
  • 56,979 కొలువులేవీ? అంటూ ఓ పత్రికలో కథనం
  • లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న షర్మిల 
  • ఉద్యోగాలను బిచ్చమేస్తున్నారా? అంటూ కేసీఆర్ కు ప్రశ్న
నిరుద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. మీడియా మిత్రులారా దయచేసి కేసీఆర్ ట్రాప్ లో పడొద్దని కోరారు. 56,979 కొలువులేవీ? అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలే కాకుండా కొత్త జిల్లాల ప్రకారం అవసరమైన ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాల్సిందేనని చెప్పారు. మీడియా మిత్రులు నిరుద్యోగుల ఆశలను చంపవద్దని కోరారు. అన్ని ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడంలో నిరుద్యోగుల పక్షాన నిలబడాలని అన్నారు.

నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలను బిచ్చమేస్తున్నారా లేక దానం చేస్తున్నారా కేసీఆర్ గారూ? అని షర్మిల ప్రశ్నించారు. లేక మీ పార్టీ నేతలకు పదవులను బిస్కెట్ వేసినట్టు ఇస్తున్నారా? అని అడిగారు. ఈరోజు కాంట్రాక్టు ఉద్యోగాలతో నెట్టుకొస్తానంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పర్మినెంట్ గా భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
YS Sharmila
YSRTP
KCR
TRS

More Telugu News