Revanth Reddy: మూడుచింతలపల్లిలో రెండో రోజుకు చేరిన కాంగ్రెస్ దీక్ష.. రచ్చబండ నిర్వహించిన రేవంత్‌రెడ్డి

revanth organised Rachabanda in muduchintalapally
  • తొలి రోజు రాత్రి దళితవాడలో రేవంత్ నిద్ర
  • ఉదయం కాలనీని పరిశీలించిన పీసీసీ చీఫ్
  • సమస్యలు ఏకరవు పెట్టిన దళితులు
  • వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు రేవంత్ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష నేడు రెండో రోజుకు చేరుకుంది. నిన్న తొలి రోజు గ్రామంలోని దళితవాడలో నిద్రించిన పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి నేడు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు దళితులు గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలను రేవంత్ ముందు ఏకరవు పెట్టారు.

కాలనీ రోడ్లు ఇళ్ల కంటే ఎత్తున ఉండడంతో నీళ్లు లోపలికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు, డబుల్  బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర విషయాలపై రేవంత్ ఆరా తీశారు. అనంతరం మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్‌కు ఫోన్ చేసి సమస్యలను వివరించారు. వెంటనే పరిష్కరించాలని సూచించారు. అంతకుముందు రేవంత్ దళిత కాలనీలో కలియ దిరిగి సమస్యలను స్వయంగా పరిశీలించారు.
Revanth Reddy
TPCC President
Muduchintalapally
Congress
KCR

More Telugu News