Andhra Pradesh: ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

All government offices should start biometric says CS Adityanath Das
  • బయోమెట్రిక్ హాజరును మళ్లీ అమలు చేయబోతున్నాం
  • బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయండి
  • ప్రతి ఉద్యోగి హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలి
ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును మళ్లీ అమలు చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు సహా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో కూడా బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని ఆయన చెప్పారు. బయోమెట్రిక్ హాజరు నమోదు నెల వారీగా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి హాజరును బయోమెట్రిక్ ద్వారా ప్రతి శాఖ కార్యదర్శి పరిశీలించాలని చెప్పారు.
Andhra Pradesh
Government Offices
Biometric Attendence
Chief Secretary

More Telugu News