Telangana: స్కూళ్లు తెరుస్తున్నాం.. అంగన్ వాడీలు కూడా తెరుచుకుంటాయి: సబితా ఇంద్రారెడ్డి

Schools to resume from September 1 says Sabitha Indra Reddy
  • సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి
  • పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా సర్పంచ్ లు చూడాలి
  • ట్రాన్స్ పోర్ట్ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంగన్ వాడీ స్కూళ్లను కూడా తెరుస్తున్నామని చెప్పారు. గత 17 నెలలుగా అన్ని వ్యవస్థలు కరోనా కారణంగా అతలాకుతలం అయ్యాయని తెలిపారు. వైద్య శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారమే విద్యా సంస్థలను తెరుస్తున్నామని చెప్పారు. సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. ప్రతిరోజు పాఠశాలల్లో ఏమేం చేశారో రాష్ట్ర అధికారులకు నివేదిక ఇవ్వాలని చెప్పారు.

విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే... టెస్టులు చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని సబితారెడ్డి తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అధికారులు ధైర్యం చెప్పాలని అన్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. స్కూల్ బస్సుల కండిషన్ చెక్ చేసుకోవాలని సూచించారు.
Telangana
Schools Reopen
Sabitha Indra Reddy

More Telugu News