Alapati Raja: వైసీపీ అధికారం చేపట్టి 27 నెలలైనా టిడ్కో ఇళ్లను ఇవ్వలేకపోయింది: ఆలపాటి రాజా

Alapati Raja fires on YCP Govt
  • ఏపీ సర్కారుపై రాజా ధ్వజం
  • కట్టిన గృహాలను నిలిపివేశారని ఆగ్రహం
  • సెంటు భూమి పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ
  • చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శలు

టీడీపీ నేత ఆలపాటి రాజా వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 27 నెలలైనా టిడ్కో ఇళ్లను ఇవ్వలేకపోయిందని విమర్శించారు. కట్టిన గృహాలను అవినీతి, రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేయడం దారుణమని అన్నారు. టిడ్కో ఇళ్లు ఏపీలోనే అతి తక్కువ ధరకు కట్టారని పార్లమెంటు సాక్షిగా చెప్పారని పేర్కొన్నారు. సెంటు భూమి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవినీతికి పాల్పడ్డారని ఆలపాటి రాజా ఆరోపించారు. 30 లక్షల పట్టాల పేరుతో అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News